MusicMint AI Music Generator Logo
MusicMint

కళాశాలలో నేను... కులాసాగా ఉన్నానే

Telugu Folk-Pop, Upbeat Tollywood Mass, Acoustic Guitar and Harmonium, Playful Male Vocals, Fast Rhythmic Tempo, 120 BPM, Catchy Percussion, Funky Bassline.

ramjee_vysyaraju·3:04

Lyrics

జడగంటే వింటుంటే బాగుంటే సైయ్యంటే

నీవెంటే వస్తుంటే అది వింతే అది వింతే

కనబడితే తడబడితే పొలమారి పొరబడితే

చొరబడితే మది తడితే కేరింతే కేరింతే

అదేమంటూ ఆలపిస్తే అలావెళ్లి పోయావే

సరేనంటూ సరసమాడితే పళ్ళునూరినావే

ఒసే అంటూ పలకరిస్తే విసుక్కుంటూ పోయావే

మూతి విరుపు వరదల్లో నన్ను ముంచినావే

Hook

కళాశాలలో నేను కులాసాగా ఉన్నానే

కాలక్షేపం అంటూ నా కొంప ముంచి నారే

అటుఇటు పాలుపోక సరే నంటూ నమ్మానే

కొంపకొల్లేరయ్యేదాకా తెలిసి చావలేదే

Verse 2

జగడాలు కలహాలు కారాలు మిరియాలు

ఎన్నెన్నో కారణాలు మగపాట్లు అగచాట్లు

మెప్పించి ఒప్పించి అర్ధించి అందించి

సేవించి పూజించి మెలగాలి నలగాలి

ఒంటరి వాడ్ని నన్నే చూసి బుట్టలో పడేసావే

తెలివి వచ్చి చూసేసరికి అంతా ఐపోయిందే

సర్దుకొని పోదామంటే సరదాలు సరిపోవే

సరే అంటూ ఊరుకోక నేనేమి చేస్తానే

Hook

కళాశాలలో నేను కులాసాగా ఉన్నానే

కాలక్షేపం అంటూ నా కొంప ముంచి నారే

అటుఇటు పాలుపోక సరే నంటూ నమ్మానే

కొంపకొల్లేరయ్యేదాకా తెలిసి చావలేదే

Like this song? Create something similar

Related AI Music Generators