
Andhala bomma
Folk

Andhala bomma
Folk
Lyrics
ఎంత సక్కాగున్నాడో
న సిన్ని రశ్మి
అందాల బొమ్మ అన్నాదో
న సిన్ని రష్మీ
అందాల బొమ్మవాని
అరిగిపోని వయసాని
అరగింపని సొగసాని...
అప్పు ఇవ్వమని అందాన్ని
అరిసి అరిసి అడిగి నానో...న సిన్ని రశ్మి
నీ కు గులాం అయిపోయానో న సిన్ని రశ్మి....
వజ్రాల వాన కురిసి పోయే
ఏడ వెతికిన ఒక్క రాయి ధోరకాపాయే
వెతికి వెతికి కాళ్ళు గుంజే
కంటి సూపు చెమ్మగిల్లే
కోహినోరు వజ్రానివే ఓ రష్మీ
నిన్ను మించిన వజ్రముండు న ఓ రష్మీ...
నువ్ బిగిసి పట్టి సీర కడితే
అదురుతాడే చీర రంగు
మురుస్తాడే పయిట కొంగు
బిగిసి కట్టు గుత్తపు రవిక
రంజు మీద పుంజు కుంటది..
నీ అందం మాసిపోనిదే ఓ రశ్మి
దాచుకున్న దాగిపోనిదే ఓ రశ్మి
....
నువ్ నిడిచే నత్త నడక చూసి
నాగు పాములు సిన్నపోవును
నీ సైగలొనే బుసలు మరచును
వాగు వంకలు పరవసించును
ఎంత సక్కని గుణమే నీది ఓ రశ్మి
మరిసిపోని తనువే నీది ఓ రశ్మి
.....
నువ్ కాలుమోపితే
కంచేరేగి కంటితీగ
మంచే ఎక్కి కేక పెట్టును
ముండ్ల పొదలాన్ని కూడా
మల్లె మొగ్గలయ్యి పోవును
మురిసి ముద్దాడునే ఓ రశ్మి
ముట్ట కుండా మురిసి పోవునే ఓ రశ్మి
....
నీ సన్నని నాయగరా
వంపు సొంపు నడుము మీద
ఎండి మబ్బులు కరగదీసి
నీలి మబ్బును ధార పోసి
బుల్లి బొడ్డుకు కాటుకద్దునే ఓ రశ్మి
నీ సిన్ని నడుముకు గిలి గింతనే ఓ రశ్మి...
నీ బొమ్మల సందులోనే
భువనగిరి బొట్టు పెట్టి
కంటికి కలువపూల కాటుకద్ధి
సందమమ వంకను
నీ కొప్పున సుట్టి
జడ అల్లు కొమ్మంటానే ఓ రశ్మి
నీ వాలు జడలు ఎంత అందమె ఓ రశ్మి..
నువ్ పక్కు పక్కు న నవ్వుతుంటే
లొట్ట సెంపలు పడతావుంటే
కళ్ళు తాగి కిల్లి వేసిన
మత్తు నాకు ఎక్కుతుంటే
దొర బుగ్గను గిచ్చుతుంటే
గల్లీ గిల్లి లొల్లి పెడతాడో న సిన్ని రశ్మి
మళ్ళీ మళ్ళీ సూడమంటధో న బుల్లి రశ్మి...
ఎంత సెప్పిన తక్కువేనే
నీ సోయగాలకి సొమ్మసిల్లితినే
నీ వయకుంటా దర్శన భాగ్యనికి
ముడుపు కట్టి వస్తానే
ఎలుకుంటా నాని సెప్పి
ఎదల కద్దు కుంటనే
కాలు కంది పోకుండా
పంజరణ సీలకోలే
ముచ్చటాడి మురిపిస్తానే ఓ రశ్మి
నిన్ను ముద్దాడి మురిసిపోతానే ఓ రశ్మి...
ఎంత సక్కని దానవే ఓ రశ్మి
అందాల బొమ్మవు నీవే ఓ రశ్మి...
......
By..
Shiva sena pandavula✍️✍️✍️
