
పొగడరా నీతల్లి భూమి భారతిని
mandolin, violin, cello, jazz

పొగడరా నీతల్లి భూమి భారతిని
mandolin, violin, cello, jazz
Lyrics
ఏ దేశమేగినా ...
ఎందు కాలిడినా ...
ఏ పీఠమెక్కినా
ఎవ్వరేమనినా ...
పొగడరా నీతల్లి
భూమి భారతిని
నిలుపరా నీజాతి
నిండు గౌరవము
పొగడరా నీతల్లి
భూమి భారతిని
ఏ పూర్వపుణ్యమో,
ఏ యోగబలమో
జనియించినాడవీస్వర్గఖండమున
ఏ మంచి పూవులన్
ప్రేమించినావో
నినుమోసె ఈ తల్లి
కనకగర్భమున
లేదురా ఇటువంటి
భూదేవి యెందు
లేరురా మనవంటి
పౌరులింకెందు
సూర్యుని వెలుతురుల్
సోకునందాక
అందాక గల ఈ అనంతభూతల్లిని
మన భూమి వంటి చల్లని తల్లి లేదని
పాడరా నీ తెలుగు బాలగీతములు
పాడరా నీ వీరభావగీతములు
పొగడరా నీతల్లి
భూమి భారతిని
తమ తపస్సుల్
ఋషుల్ ధారవోయంగా
శౌర్యహారము రాజచంద్రులర్పింప
రాగదుగ్ధము భక్తరక్తముల్ పిదుక
భావసూత్రము కవిప్రభువులల్లంగా
పొగడరా నీతల్లి
భూమి భారతిని
దిక్కులకెగదన్ను
తేజముల్ వెలుగ
రాళ్ళు తేనియలూరు
రాగాలు సాగ
సౌన్దర్య మెగబోయు
సాహిత్యమలర
పొగడరా నీతల్లి
భూమి భారతిని
వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్రా
అవమానమేలరా అనుమానమేల
భారత పుత్రుండనచు భక్తితో బలుక.
పొగడరా నీతల్లి
భూమి భారతిని
నిలుపరా నీజాతి
నిండు గౌరవము
