MusicMint AI Music Generator Logo
MusicMint

అందమైన చిలుకా

vibrant, folk, melodic

satish geda·4:00

Lyrics

గొల్లభామలా, చందమామలా, చిట్టి గువ్వలా..

రావే రావే అందమైన చిలుకా...

వెలుగు రేఖలా, సెలయేరులా, తోకచుక్కలా..

రావే రావే అందమైన చిలుకా...

పట్టు పరికినీలో సింగారాలే ఒలకబోసుకుంటూ .. చక్కనమ్మలా..

స్వప్నాలన్నీ కంటికింపుగా, కమలకాంతిలో విరాజిల్లినా మల్లె మొగ్గలా..

వానజల్లులా, చిన్న మెరుపులా..

పదములన్నీ మూటగట్టగా, స్వరాలు సంగీతమవ్వగా..

రావే రావే అందమైన చిలుకా...

నాకు తొడుగా నీడగా, నా పాటకూ ఆటగా..

అడుగులో అడుగులా, కంటికీ రెప్పలా..

గుండెలోనా.. నీకై కట్టిన గుడిలో వచ్చి సేదతీరవా

రావే రావే అందమైన చిలుకా...

గొల్లభామలా, చందమామలా, చిట్టి గువ్వలా..

అడుగులో అడుగులా, కంటికీ రెప్పలా..

నాకు తొడుగా నీడగా, నా పాటకూ ఆటగా..

రావే రావే....వానజల్లులా, చిన్న మెరుపులా..

మేఘాలే మౌనంగా..చల్లంగా వెదజల్లిన పులకింతలు..

సడిలేకుండా సూరీడు.. వెలిగించిన ఉదయాలు..

శూన్యాన్నే చీల్చిన చందురుడి సొగసులు..

వస్తూనే పోతున్నయ్ అమాసపున్నమిలు..

కలలేమో కల్లలయ్యే..నీ కాన రాలేదే..

గుండేమో భారంగా నీ కొరకై నిట్టూర్పులు..

నా గోడు వినంగా..వరమీయవా..

రావే రావే అందమైన చిలుకా...

నాకు తొడుగా నీడగా, నా పాటకూ ఆటగా..

అడుగులో అడుగులా, కంటికీ రెప్పలా..

గుండెలోనా.. నీకై కట్టిన గుడిలో వచ్చి సేదతీరవా..

గొల్లభామలా, చందమామలా, చిట్టి గువ్వలా..

వెలుగు రేఖలా, సెలయేరులా, తోకచుక్కలా..

నాకు తొడుగా నీడగా, నా పాటకూ ఆటగా..

రావే రావే....వానజల్లులా, చిన్న మెరుపులా..

Like this song? Create something similar