MusicMint AI Music Generator Logo
MusicMint

idi mallela maasam

male vocals, female vocals drums flute, electronic, soul, emo, ballad, synth, rap, slow, punk, fast, chill, aggressive, folk, psychedelic, hard rock, house, progressive, acoustic guitar, 80s, jazz, melodic, 90s, smooth

Chinna Naik·4:49

Lyrics



ఇది మల్లెలమాసం
వలపుల వారం
ప్రేమకు తీరం

పరువానికి ప్రాయం
మదనుడి సాయం
కోరిన గేయం


******************

ఈ మల్లెల మాసంలో..హో...

చెలికొమ్మలలో
తొలికోయిలలా
చిగురాకుల ఊయలలూగె

వసంతమిక వచ్చెనులే

వయసు నులి వెచ్చనలే

ఉషస్సులిక కన్నులులే..

మనసులిక వెన్నెలలే

తడి చిత్తడిలో ఎద హాత్తుకునే
పడుచాకుల పందిరి వెసె
ముహూర్తమిక ఆగదులే
ముడే ఇక వీడదులే

జతే ఒక జావళిగా...ఆ
శ్రుతే ఇక మించెనులే



వేణువు వంతెన వేసే
మధూదయంలోనే

పరువము పదే పదే..
విరబూసేనే

సూర్యుడు కన్నులు గీటే
శుభోదయంలోనే..

పిలుపులు ప్రియా ప్రియా...
అనురాగాలే

తడబడు పెదవుల చప్పుడే
తగిలెను ముద్దులు ఇప్పుడే

అడగక తప్పదు అప్పుడే
అలిగిన సొగసులు గుప్పెడే

ఇవి జంటలలో
చలి మంటలులే
ఒడి గంటలు మోగిన వేళ


కులుకు ముల్లు గుచ్చుకునే

వగలు అరవిచ్చెనులే

చినుకువాలు కన్నులలో...

నెమలి కళలొచ్చెనులే..



హంసలు మోసుకు వచ్చిన
హాయివి నీవేలే...

హంపిని కాసిన సొంపుల
రేయివి నీవేలే..


ప్రేమకు పాటలు నేర్పిన
పల్లవి నీవేలే

పూచిన ఆశల పూవుల
పల్లకి నీవేలే

కుడి బుజమదిరెను గుట్టుగా

శుభశకునములకు గుర్తుగా

తొడిమకు చాటున మొగ్గలా
తడమకు నేనా సిగ్గిలా

తొలి చూపులనే
గాలింపులలో
జల్లించకు మన్మధ మాల

వయస్సొక వాకిలిలే

ప్రియా అది దాటవలే
**************


ఇది మల్లెలమాసం
వలపుల వారం
ప్రేమకు తీరం

పరువానికి ప్రాయం
మదనుడి సాయం
కోరిన గేయం..

చెలికొమ్మలలో
తొలికోయిలలా
చిగురాకుల ఊయలలూగె

వసంతమిక వచ్చెనులే

వయసు నులి వెచ్చనలే

జతే ఒక జావళిగా..
శ్రుతే ఇక మించెనులే


Like this song? Create something similar